తెలుగు వార్తలు » Delhi Violence news
సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. సోమవారం మొదలైన ఈ అల్లర్లు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య పదికి చేరగా.. దాదాపు 150మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను పోలీసులు సీజ్ చేశారు