Complete Lockdown : మిజోరం రాజధాని ఐజ్వల్ మున్సిపల్ కార్పొరేషన్లో మరోసారి లాక్డౌన్ విధించారు. మంగళవారం ఉదయం 4.30 గంటల నుంచి నవంబర్ 3 ఉదయం 4.30 గంటల వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల విభాగం అధికారులు ప్రకటించారు. మిజోరం హోంమంత్రి, ఆరోగ్య మంత్రి నేతృత్వంలో సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
కరోనా పేరుతో అమాయకుల్ని దోచుకుంటున్న ప్రయివేట్ ల్యాబ్స్ కు చెక్ పడింది. విజయవాడలో నడి రోడ్డుపై కరోనా పేషెంట్లను దోచుకుంటున్న ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్సులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తిరుమల కొండపై గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన చెత్తకు టీటీడీ సరికొత్త పరిష్కారాన్ని కనుకొంది. కొత్త టెక్నాలజీ ద్వారా చెత్తను ఎరువుగా మార్చాలని యోచిస్తోంది. టెంపుల్ సిటీకి కొత్త లుక్ ఇచ్చేందుకు టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై కరోనా ప్రభావం పడుతోంది. పంద్రాగస్టు వేడుకలు ఈ సారి ప్రగతి భవన్లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రగతి భవన్లోనే నిర్వహించవచ్చని తెలిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లోనే పతాకావిష్కరణ చేయనున్నట�