తెలుగు వార్తలు » Dantewada » Page 2
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న మైనర్ బాలిక కాలేజ్ హాస్టల్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. నక్సల్ ప్రభావిత ప్రాంతంగా చెప్పుకునే దంతేవాడ జిల్లా పతర్రాస్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. వెంటనే బాలికను ఆస్పత్�
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు బీభత్సాన్ని సృష్టించారు. రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 9 వాహనాలకు నిప్పుపెట్టారు. ఆదివారం పట్టపగలు జరిగిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానిక ఎన్ఎండీసీ ప్లాంట్ పనులు జరుగుతుండగా.. కొందరు మావోయిస్టులు ఆయుధాలతో వచ్చి.. పనులు చేస్తున్న వారిని బెదిరింపులకు గురిచేశారు. అ�
దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గడ్‌లోని దంతెవాడ జిల్లాలో.. మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. కాటేకల్యాన్ అటవీ ప్రాంతంలో.. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్‌జీ) బలగాలు కూంబింగ్ చేపడుతున్న సమయంలో.. మావోయిస్టులు డీఆర్‌జీ బలగా�
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం శనివారం కాల్పులతో మార్మోగింది. మొత్తం మూడు వేర్వేరు ప్రాంతాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. పోలీసులు కూంబింగ్ చేపడుతున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. సుకుమా జిల్లా పరిధిలోని తాడ్‌మెట్ల వద్ద మావోయిస్టులు రోడ్డును తవ్వినట్లు భద్రతా బలగాలకు సమాచారం అంద�
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒక మహిళ ఉంది. రాయ్‌పూర్‌కి 400 కిలోమీటర్ల దూరంలో ఉండే గమియాపాల్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవా మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్�
నక్సల్స్ ఏరివేతకు ఇక రంగంలోకి నారీ శక్తి దిగింది. 30మంది మగువలు అత్యంత కఠినమైన శిక్షణ పూర్తిచేసుకుని కీకారణ్యంలో కాలుమోపారు. వారి లక్ష్యం ఒక్కటే.. కనిపించే మావోలను హతమార్చడమే. దేశంలో తొలిసారిగా కేవలం అంతా మహిళలే ఉన్న యాంటీ నక్సల్ కమాండో యూనిట్ ప్రారంభమైంది. చత్తీస్ గఢ్ లో నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే దంతెవాడ, బస్తర�