ఒక్క వరి పంటే కాదు ఉద్యానవన పంటలను సైతం అసని తుఫాను అల్లకల్లోలంగా మార్చింది. అనంతపురం నుంచి మొదలుకొని, కృష్ణ, గుంటూరు, బాపట్ల, ఉభయగోదావరి, విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అసని తుఫాను సృష్టించిన బీభత్సంతో రైతన్న గుండె చెరువయ్యింది.
Cyclone Asani Highlights: అసని తుపాన్ రెండు రోజులుగా ఏపీ తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచాయి. ..
కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ వర్షాలు..రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశముందని తెలిపింది.
కృష్ణా జిల్లాకు రానున్న 6 గంటలు కీలకమని ప్రకటించారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమాదముందని ప్రకటించారు.
సంతబొమ్మాలి మండలం ఎం సున్నాపల్లి సముద్ర తీరానికి ఓ స్వర్ణ రథం కొట్టుకొచ్చింది. దీంతో తీరానికి పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని ఈ రథాన్ని పెద్ద తాళ్లతో లాగుతూ ఒడ్డుకు చేర్చారు. బంగారు వర్ణంతో ఈ రథం మెరిసిపోతోంది. దీని మిస్టరీ దాదాపు వీడిపోయింది.
అసని తుఫాన్‌తో ఏపీ తీరం వెంట సముద్రం ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో ఆ తుఫాన్ ధాటికి కోస్తాంధ్రాలోని శ్రీకాకుళం (Srikakulam) తీరానికి ఓ రథం కొట్టుకువచ్చింది.