డెల్టా వేరియంట్ 85 దేశాల్లో విస్తరించిందని, ఇది మరిన్ని దేశాల్లో ప్రబలం కావచ్ఛునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 170 దేశాల్లో వేరియంట్ అల్ఫా, 119 దేశాల్లో వేరియంట్ బేటా, 71 దేశాల్లో గామా కొనసాగుతున్నాయని. వీటిని నిర్లక్ష్యం చేయరాదని...
తమిళనాడులో పూర్తి లాక్ డౌన్ విధించారు. వారం పాటు ఇది అమల్లో ఉంటుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. గత 24 గంటల్లో 36 వేలకు పైగా కోవిద్ కేసులు నమోదు కావడంతో ఈ చర్య తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
పశ్చిమ బెంగాల్ లో రేపటి నుంచి రెండువారాల పాటు పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు బంద్ పాటిస్తాయని పేర్కొంది.
ఇండియా పొరుగునున్న నేపాల్ లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. హాస్పిటల్స్ అన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. తమను వెంటనే ఆదుకోవాలని ప్రధాని కె.పి.శర్మ ఓలి ప్రపంచ దేశాలను కోరుతున్నారు.
దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో ..ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చలు జరిపి ఓ జాతీయ వ్యూహాన్ని రూపొందించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ సూచించారు.
మౌఖికంగా కోర్టు చేసే వ్యాఖ్యలపై మీడియా రిపోర్టు చేయకుండా దాన్ని నియంత్రించాలని ఎన్నికల కమిషన్ మద్రాహ్ హైకోర్టును కోరింది. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ ర్యాలీలను....
కర్ణాటకలో కోవిడ్ విశ్వరూపం చూపుతోంది. ఒక్కరోజులో 31 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 180 మంది రోగులు మృతి చెందారు. ఇక బెంగుళూరు నగరంలో ఒక్కరోజులో...
తీవ్రమవుతున్న ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు దేశ వ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ముంబైలో మాస్క్ ధరించకుండా క్రికెట్ ఆడిన 20 ఏళ్ళ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలన్న అతడి అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించింది..