ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరానికి పొంచి వున్న తుఫాను ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తుఫాను తీవ్రతను సరిగ్గా అంచనా వేయాలని, దాని కదలికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలోని ఆ నాలుగు జిల్లాలను వదలొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రత్యేకంగా దృష్టి సారించడం ద్వారా కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఇకపై ఏపీలో ప్రతీ రోజు పది వేల నుంచి పదిహేను వేల వరకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్తగా ర్యాపిడ్ టెస్టు కిట్లు దక్షిణ కొరియా నుంచి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఏపీవ్యాప్తంగా ప్రతీ కుటుంబంలో కరోనా సర్వే నిర్వహించేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పటికే మొదటి, రెండు దశల కుటుంబ సర్వే పూర్తి అయినందున మిగిలిన అన్ని కుటుంబాల్లోను కరోనా సర్వే పూర్తి చేయాలని ఆయన ఆదేశాలిచ్చారు.
తెలంగాణలో శరవేగంగా పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓకేరోజు ఎనిమిది మందికి పాజిటివ్ రావడం.. ఆ తర్వాత కూడా ప్రతీరోజు రెండు, మూడు చొప్పున కరోనా పాజిటివ్ తేలుతుండడంతో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగనున్నారు.