Chicken price: పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకులతో పాటు అన్ని ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చికెన్ ధర దూసుకుపోతోంది. మార్కెట్లో కిలో చికెన్ ధర రికార్డు స్థాయిలో ..
కోడికూర ఇకపై కోటీశ్వరులు తినే కూరగా మారనుందా? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. మార్కెట్లో చికెన్ రేటు ఒక్కసారిగా కొండెక్కింది. ఏకంగా బహిరంగ మార్కెట్లో రూ. 300లకు చేరుకుంది. పెరిగిన ధరలు చికెన్ ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి.
కొందరికి ప్రతిరోజు ముక్క ఉంటే గానీ ముద్ద దిగదు. అందులోనూ చికెన్ తప్పనిసరి. ఇప్పుడు అదే కోడి కొండెక్కి కూర్చుంది. ఉన్నపళంగా ధర పెరిగి మాంసాహార ప్రియుల్ని బెంబేలెత్తిస్తోంది.