టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మృతిచెందారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముత్యంరెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి �