తెలుగు వార్తలు » Chennai : home for transgenders
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఆయన ఎవర్‌గ్రీన్. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. తాజాగా ఆయన తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన ట్రాన్స్‌జెండర్స్ కోసం గృహ నిర్మాణానికి రూ.కోటిన్నర నగదును విరాళంగా ప్రకటించారు.