శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంత మెండిస్ ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు మొండిచేయి వేయడంతో నిరాశ చెందిన అతడు 34 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. చివరిసారిగా అతడు 2015లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పటికీ అతడికి అవకాశాలు రాకపోవడం గమనార్హం. �