విండీస్‌తో జరుగుతున్న టెస్టులో భారత్ భారీ స్కోరు చేసింది. తెలుగు తేజం హనుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ శతకంతో కదంతొక్కడంతో కడపటి వార్తలందేసరికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 140.1 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (76; 10 ఫోర్లు) అర్ధశతకంతో మెరిశాడు. సొగసరి లక్ష్మణ్‌ను తలపించేలా చూడచక