Budget 2022: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం సందర్భంగా జనవరి 17న విడుదల చేసిన రెండు ఆక్స్ఫామ్( Oxfam) నివేదికలు, ప్రపంచంతోపాటు భారతదేశంలో సంపద, ఆదాయంలో అసమానతల(Inequality) విస్తరణపై పలు వివరాలు వెల్లడించాయి.
దేశంలో మొదటిసారి లాక్డౌన్(Lockdown) విధించినపుడు చాలామంది కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నించారు. రవాణా సదుపాయాలు లేక వేలాది కిలోమీటర్లు వాళ్ళు కాలినడకన తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. ఆ దృశ్యాలను ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు.
దేశ ఆర్ధిక పరిస్థితిపై రకరకాలుగా వాదనలు వెలువడుతున్నాయి. వివిధ రకాలైన ఒత్తిళ్ళతో మన ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయితే, ఎంత ఎదురుగాలులు వీచినా మన ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి గురించి నిపుణులు ఆశావాదంతోనే ఉన్నారు.
జన్ ధన్ యోజన మూడో దశను ఈ బడ్జెట్లో ప్రారంభించే అవకాశం ఉంది. దీని కింద, జన్ ధన్ ఖాతాదారులందరికీ డిజిటల్ బ్యాంకింగ్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యంతో అనుసంధానించున్నారు.