పెళ్లిళ్లలో కొత్త జంటలు డ్యాన్స్ చేసిన వీడియోలు లేదా వధువు, వరులు పెళ్లి పీటల మీదనే ఒకరిని మరోకరు కొట్టుకున్న వీడియోలు ఇట్టే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో వేడుకలు, విందులు వినోదాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మునపటిలాగే గ్రాండ్గా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. చాలా మంది తమ పెళ్లి ఎలా జరగాలి.. ఎలాంటి అమ్మాయి భార్యగా రావాలి అని విషయాలలో ఎన్నో కలలు కంటారు. మేళా తలాలు.. బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరుపుకుంటుంటారు.
పెళ్లంటేనే నూరేళ్ల పంట. బంధువులు, స్నేహితులు నవ వధూవరులను ఆటపట్టించడం.. మరీ ముఖ్యంగా వధువు తరపున బంధువులు.. వరుడికి సంబంధించిన వస్తువులు దాచిపెడుతూ కాసేపు ఫన్ క్రియేట్ చేస్తుంటారు.