మహబూబాబాద్‌లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని అండర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
నెల్లూరు జిల్లాలో చేతబడి కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని భార్గవ్ అనే వ్యక్తిపై చేతబడి చేసినట్లు అతడి తల్లిదండ్రులు, భార్య ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అతడు తీవ్ర అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.