కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని అందుకు తనను సుఖ పెట్టాలని ఓ మహిళను కోరాడంటూ బీజేపీకి చెందిన మాజీ మంత్రి రమేష్ జర్కిహోలిపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న 'సిట్' బృందం నిర్ధారించింది.
ఇన్ని నెలల సస్పెన్స్ అనంతరం కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప రాజీనామా చేశారు. ఇక కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది తెలియాల్సి ఉంది. తన రాజీనామా గురించి సోమవారం ఆయన ప్రకటిస్తున్నప్పుడు భావోద్వేగంతో కంట తడి పెట్టారు.
తన రాజకీయ భవితవ్యం గురించి బీజేపీ హైకమాండ్ నుంచి ఈ సాయంత్రం ఏదైనా సందేశం (మెసేజ్) రావచ్చునని, అది అందగానే మీడియాకు తెలియజేస్తానని కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
కర్నాటక లో సీఎం ఎడ్యూరప్ప నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆయన పలువురు మఠాధిపతులతోను, చివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి తో కూడా సమావేశాలు జరుపుతున్నారు.
బెంగుళూరు లోని సిటీ క్రైమ్ బ్రాంచి పోలీసులు శనివారం తెల్లవారు జామున పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుపైన,.. నగరంలోని రౌడీ షీటర్ల ఇళ్ల పైన ఏకకాలంలో సోదాలు, దాడులు జరిపారు.