తెలుగు వార్తలు » begin
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన ఆరోపణలతో లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి భారీ షాక్ తగిలింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే కేసుకు సంబంధించిన విచారణ మళ్లీ సోమవారం నుంచి మొదలుకానుంది.
కోవిడ్–19 వైరస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో నిర్వహిస్తున్న సీరో సర్వైలెన్స్ సర్వే నేటి నుంచి మిగతా 9 జిల్లాల్లో మొదలు కానుంది. ఒక్కో జిల్లాలో 5 వేల నమూనాలు సేకరించి సర్వే నిర్వహించనున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
అయోధ్యలో ఇక రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేశారు. శ్రీరామనవమి రోజయిన ఏప్రిల్ 2 నుంచి నిర్మాణం మొదలు కానుంది. రెండేళ్లలో నిర్మాణం పూర్తి అవుతుందని అంచనా.