తెలుగు వార్తలు » bazar
కూరగాయలు ధరలు కొండెక్కాయి. మార్కెట్లో ఏది కొందామని చూసినా పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి. బెండకాయ నుంచి వంకాయ వరకు.. బీరకాయ నుంచి సొరకాయ వరకు ధరలు భగ్గమంటున్నాయి. ఇక సామాన్యులైతే మార్కెట్ వైపు చూసేందుకే భయపడుతున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయిన పేదలను ఈ ధరలు భయపెడుతున్నాయి.