తెలుగు వార్తలు » Bathukamma
బతుకమ్మ పాటల్లో హితోక్తులు ఎక్కువ. వాటితో పాటు ఆర్ర్దత వుంటుంది. ఆవేశం వుంటుంది. ఆవేదన వుంటుంది. అణచివేతకు గురైన ఆవేశం వుంటుంది. ఉద్వేగం, ఉక్రోషం, ఉద్యమం, ప్రేమలు, అనురాగాలు, నిరాశ, దు:ఖాలు అన్నీ వుంటాయి.
తెలంగాణలో బతుకమ్మ గొప్ప వేడుక.. అచ్చంగా జానపదుల పండుగ. ప్రాచీనమైన పండుగ. కావ్యాల్లోనూ, చరిత్ర పుస్తకాల్లోనో లేకపోయినంత మాత్రానా బతుకమ్మను ఇటీవలి పండుగగా చెప్పుకోవడానికి వీలులేదు.
బతుకమ్మను పేర్చడం ఓ కళ. అలంకారినికో పరీక్ష. సౌందర్యాభిలాషకో నిదర్శనం. బతుకమ్మను పేర్చేవారికి పూల పరిచయముండాలి. . రంగుల రహస్యం తెలుసుండాలి. అద్దకం, కలంకారి పనితనం కావాలి.
బతుకమ్మ…కల్లలెరుగని తెలంగాణ ప్రజల సంబరం…పల్లె పల్లెన కనిపించే మహోత్సవం.. వెల్లివిరిసే పూల సమ్మేళనం.. వెదజల్లే మట్టి పరిమళం. ….బతుకమ్మ…ఒక అందమైన సంస్కృతిని ప్రతిబింబించే అపురూప దృశ్యం. తెలంగాణ విశిష్టతను చాటి చెప్పే సందర్భం…. యాంత్రిక జీవనంలో విసిగిపోయే మహిళలకు ఉల్లాసాన్ని మానసిక నవోత్తేజాన్ని అందించే పర్వది
తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారు.
పది మందితో కలిసి సరదాగా, సంబరంగా, సంతోషంగా జరపుకునేదే పండుగ.. కరోనా వైరస్ ఆ సరదాను కూడా లేకుండా చేసింది.. కరోనానే లేకపోయి ఉంటే ఉగాది, శ్రీరామనవమి, వినాయకచవితి, రంజాన్ పర్వదినాలను ఎంత గొప్పగా చేసుకుని ఉండేవాళ్లమో!
హైదరాబాద్‌లోని హోటల్ టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీరల పంపిణీ, డిజైన్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, టెస్కో ఎండీ శైలజ రామయ్యర్, మహిళా సంఘాలు పాల్గొన్నాయి.
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఘనంగా మొదలైంది. తీరొక్క పూలతో అంగరంగ తీర్చిదిద్దిన బతుకమ్మలు కొలువుదీరాయి.
ఈ నెల 17న ఎంగిలి పూల బతుకమ్మ ఆడుకోవాలని, ఇందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేయాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి వెల్లడించింది.
తెలంగాణ పల్లెలకు పండుగ కళ వచ్చింది. ఆర్టీసీ సమ్మె తలపెట్టినా.. పల్లెల్లో బతుకమ్మ జరుపుకోవడానికి తెలంగాణ ప్రజానీకం ఆసక్తి చూపారు. భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ ఆడపడుచులు తమకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. తొమ్మిది రోజులుగా బతుకమ్మ