Bathini Fish Prasadam: మృగశిర కార్తె అరుదెంచే అరుదైన సందర్భాన చేప ప్రసాదం స్వీకరించేందుకు వేలాది మంది తరలివస్తుంటారు. కానీ.. ఈసారి వీరి ఆశలపై కోవిడ్ –19 నీళ్లు చల్లింది.
కరోనా ప్రభావం చేప మందుపై కూడా పడింది. అస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్ లో బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తూ వస్తున్నారు. కరోనా కారణంగా ఈ యేడాది చేప మందు వేయడం లేదని బత్తిన హరినాథ్ గౌడ్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు హరినాథ్ గౌడ్ వెస్ట్ మారేడ్పల్లిలోన