హరీష్ శంకర్ వర్సెస్ బండ్ల గణేష్.. వీరిద్దరి మధ్య వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి కాంబోలో ‘గబ్బర్‌సింగ్’ రాగా అది పెద్ద విజయాన్ని సాధించింది. ఇటీవలే ఈ మూవీ విడుదలై ఎనిమిది సంవత్సరాలు కూడా పూర్తైంది. ఈ సందర్భంగా అందరికీ కృతఙ్ఞతలు చెప్పిన హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ పేరును మాత్రం ప్రస్తావించలేదు.