ఊళ్లో చోరీ చేద్దామని వచ్చాడు..పాపం గ్రామస్తుల కంటపడ్డాడు..ఇంకేముందీ..చేతికందిన కర్రలు, బరిసెలె తీసుకుని స్థానికులు ఆ దొంగను వెంబడించారు. దీంతో బతుకు జీవుడా అంటూ..పరుగులంకించాడు. పాపం చీకట్లో దారి కనిపించక పాడుబడిన బావిలో పడిపోయాడు. అది పాడుబడినా పాతబావి, పైగా అందులో నీళ్లు లేకపోవడంతో..అతడికి నడుము విరిగి లేవలేకపోయాడు.