కరోనా సంక్షోభంతో నెమ్మదించిన ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. 'ఆత్మ నిర్భర్ భారత్' ఉద్దీపన చర్యల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలను వెల్లడించింది. మూడో విడత ఉద్దీపన చర్యల్లో భాగంగా 12 కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.