తెలుగు వార్తలు » Assembly Elections 2021 » Page 3
వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి గత లోక్‌సభ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ మార్పు.. వామపక్షాల ఓట్లు కాషాయ దళానికి బదిలీ కావడం.
West Bengal Elections 2021: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం రసవత్తరంగా సాగుతోంది. కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాలంటూ ప్రజలను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై కేంద్ర ఎన్నికల సంఘం 24 గం.ల నిషేధం విధించడం తెలిసిందే.
వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్నాయి. అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్.. భారతీయా జనతా పార్టీ ఎన్నికల్లో నువ్వా..నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ప్రజల నుంచి మద్దతు కూడ గట్టేందుకు.. ఓట్లను కొల్ల గొట్టేందుకు ఎటువంటి అవకాశం దొరికినా వదలడం లేదు.
బెంగాల్ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఓటేసే పండగ నాడు బెంగాలీలకు నల్లగుర్తు కన్నా ఎర్రగుర్తును ఎక్కువగా చూశారు. బీజేపీ- టీఎంసీ మధ్య సాగుతున్న మసాలా డైలాగ్‌వార్.. ఎలక్షన్ హీట్‌ను పెంచేసింది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అధికార తృణాముల్ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలోని మైనార్టీలకు చేసిందేమీ లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తులు బెంగాల్‌లో మైనార్టీల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని...
West Bengal Election 2021: కేంద్ర బలగాలపై చేసిన విద్వేషపూరిత ప్రసంగంపై వివరణ కోరుతూ తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
కోల్ కతా నగరం నడిబొడ్డులో టీఎంసీ-బీజేపీ వర్గాలు బాహా బాహీకి దిగాయి. బీజేపీ అభ్యర్థి రుద్రనిల్ ఘోష్ పోటీ చేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఇరువర్గాలు విచక్షణా రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
హాట్ హాట్ డైలాగులు, ఆరోపణలతో వేడిగా సాగుతోంది వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. ఇంకా మూడు దశలు మిగిలి ఉన్నాయి. మరో ల్లో 132 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇంకో రెండు వారాలే గడువు.
ఎన్నికల ప్రచార సభలు కోవిడ్ హాట్‌స్పాట్‌లుగా మారాయి. అభ్యర్థులు, ప్రచారకులు మాస్క్‌లు ధరించకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసీ జారీ చేసిన కోవిడ్ 19 మార్గదర్శకాలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.
బెంగాల్ రాష్ట్రంలో ఉద్ధండ నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ కీలక స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు.. వారిలో ఎవరిని విజయలక్ష్మి వరించనున్నది.. అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.
