కరోనాపై యుద్ధానికి ఏపీ ప్రభుత్వం కోవిడ్ 19 వారియర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనాను సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాలంటీర్ల నియామకం చేపట్టబోతున్నట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం. గిరిజాశంకర్ తెలిపారు.