ఏపీలో గ్రామ సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 21,69,814 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగా.. 19,74,588 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను సెప్టెంబరు 18న విడుదల చేయనున్నారు.