ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను ఈ నెలాఖరులోగా ప్రకటించేందుకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఇటీవలే దరఖాస్తు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణపై పంచాయితీ రాజ్ కమిషనర్ మాట్లాడారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున 1,33,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని.. వీటికి 22.73లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెల