ఏపీ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వద్ద జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తాజాగా సీఎం జగన్ మంత్రులకు శాఖలు కేటాయించారు.
ఏపీ కేబినెట్ విస్తరణలో పలు వర్గాలకు ప్లేసు దక్కలేదు. కమ్మ,వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలకు ప్లేస్ చోటు కల్పించలేదు. అయితే ఆ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇవ్వనున్నారు సీఎం జగన్.
కసరత్తులో భాగంగా కొత్త మంత్రుల పేర్లతో పాటు, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయంపైనా సీఎం ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయినవారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.