అనంతపురం జిల్లా పోలీసులు మానవత్వం చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణీని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి పురుడు పోయించారు. వరలక్ష్మి అనే నిండు గర్భిణీ కాన్పు కోసం కడప నుంచి కర్నూలు కు ట్రైన్లో బయల్దేరింది. తాడిపత్రి స్టేషన్ సమీపిస్తుండగా ఆమెకు ఉన్నట్టుండి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. దీంతో బాధి�
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జీరో ఎఫ్ఐఆర్ విధానం మహిళలకు భరోసా నిస్తోంది. మొన్నామధ్య కృష్ణా జిల్లా నందిగామ పరిధిలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదుకాగా, తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ బుక్‌చేసి కేసు నమోదు చేశారు. జిల్లాకు చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ �
ఒకరికి తెలియకుండా మరోకరి పెళ్లి చేసుకున్నాడు..అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు అమ్మాయిలకు తాళికట్టాడు ఓ ప్రబుద్ధుడు. అనంతపురం జిల్లాలో నిత్యపెళ్లికొడుకు గుట్టురట్టు చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బుద్దివాండ్ల పల్లికి చెందిన రంగప్ప అనే వ్యక్తి ముగ్గురు అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకున�
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ఓ మసాజ్ సెంటర్లో పైథాన్ హల్చల్ చేసింది. మసాజ్ సెంటర్లోని లిఫ్ట్‌లో దూరిన కొండచిలువ సిబ్బందిని, కస్టమర్లను హడలెత్తించింది. స్థానిక గోకులంలోని ఓ మసాజ్ సెంటర్లోని లిఫ్ట్‌లోకి కొండచిలువ దూరింది. అది గమనించని మసాజ్ సెంటర్ సిబ్బంది లిఫ్ట్ ఓపెన్ చేయగానే పైథాన్ ప్రత్యక్షమైంద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల కోసం ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తెరవాలని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చ�