మొహాలీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం మొహాలీలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కాగా డికాక్ (60; 39 బంతుల్లో), రోహిత్ శర్మ (32; 18 బంతుల్లో), హార్దిక్ పాండ్య (31; 19 బంతుల�