ఆంధ్ర అవతరణ దినోత్సవంగా నవంబర్ 1 న జరపాలని చెప్పి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైందికాదని భావిస్తున్నాను. ఎందుకంటే ఎందరో మహనీయుల త్యాగఫలంగా, వారి పోరాట ఫలితంగా 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ తర్వాత అనేక పోరాటాలు, ఆత్మత్యాగాలు జరిగిన పిదప,