‘టబు’కు బన్నీ టీమ్ గ్రాండ్ వెల్‌కమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ షెడ్యూల్‌లో భాగంగా షూటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సీనియర్ నటి టబు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన చిత్ర యూనిట్.. టబుకు గ్రాండ్ వెల్‌కమ్ తెలిపింది. కాగా ఈ మూవీతో దాదాపు 11ఏళ్ల తరువాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తోంది టబు. ఇదిలా ఉంటే నాన్న సెంటిమెంట్‌తో […]

‘టబు’కు బన్నీ టీమ్ గ్రాండ్ వెల్‌కమ్
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2019 | 12:39 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ షెడ్యూల్‌లో భాగంగా షూటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సీనియర్ నటి టబు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన చిత్ర యూనిట్.. టబుకు గ్రాండ్ వెల్‌కమ్ తెలిపింది. కాగా ఈ మూవీతో దాదాపు 11ఏళ్ల తరువాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తోంది టబు.

ఇదిలా ఉంటే నాన్న సెంటిమెంట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందుకోసం నాన్న నేను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే రెండోసారి జత కడుతుండగా.. సుశాంత్, నివేథా పేతురాజ్, నవదీప్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.