విదేశీ తబ్లీఘీలకు జరిమానా విధించిన కోర్టు

విదేశాల నుంచి వచ్చిన తబ్లీఘీ జమాత్‌ సభ్యులకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ కోర్టు జరిమానా విధించింది. కిర్గిస్థాన్‌, ఇండోనేషియా దేశాలకు చెందిన తబ్లీఘీ జమాత్‌ సభ్యులకు కోర్టుజరిమానా విధించింది. వీరంతా..

విదేశీ తబ్లీఘీలకు జరిమానా విధించిన కోర్టు
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2020 | 1:16 PM

విదేశాల నుంచి వచ్చిన తబ్లీఘీ జమాత్‌ సభ్యులకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ కోర్టు జరిమానా విధించింది. కిర్గిస్థాన్‌, ఇండోనేషియా దేశాలకు చెందిన తబ్లీఘీ జమాత్‌ సభ్యులకు కోర్టుజరిమానా విధించింది. వీరంతా ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన సమావేశానికి నిబంధనలు ఉల్లంఘించి హాజరయ్యారు. దీంతో వీరిపై వీసా నిబంధనల ఉల్లంఘన ప్రకారంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కిర్గిస్థాన్ నుంచి వచ్చిన పన్నెండు మందికి ఒక్కొక్కరికి రూ.6000/- జరిమానా విధించింది భోపాల్ కోర్టు. ఇక ఇండోనేషియాకు చెందిన మరో పన్నెండు మంది తబ్లీఘీ జమాత్‌ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.7000/- జరిమానా విధించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పట్టుబడ్డ తబ్లీఘీ జమాత్‌ సభ్యులపై స్థానిక కోర్టులు జరిమానాలు విధిస్తున్నాయి.

Read More :

దారుణం.. యూపీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

నా క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా.. పుదుచ్చేరి సీఎం