ఆ పాత్ర త‌న కెరీర్​లోనే పెద్ద ప్ర‌యోగం అంటోన్న తాప్సీ…

ప్ర‌స్తుతం మంచి మంచి పాత్ర‌లు చేస్తూ హిందీ చిత్రసీమ‌లో త‌న‌కుంటూ ఓ సెప‌రేట్ ఇమేజ్ సొంతం చేసుకుంది​ హీరోయిన్​ తాప్సీ పన్ను. తాజాగా, 'సాంఢ్ కీ ఆంఖ్'​ మూవీ కోసం పరిశీలించిన తన ఫ‌స్ట్ ట్రయల్​ లుక్​ను సోష‌ల్ మీడియా వేదికగా పంచుకుందీ అందాల తార‌.

ఆ పాత్ర త‌న  కెరీర్​లోనే పెద్ద ప్ర‌యోగం అంటోన్న తాప్సీ...
Follow us

|

Updated on: Jul 13, 2020 | 11:33 PM

ప్ర‌స్తుతం మంచి.. మంచి పాత్ర‌లు చేస్తూ హిందీ చిత్రసీమ‌లో త‌న‌కుంటూ ఓ సెప‌రేట్ ఇమేజ్ సొంతం చేసుకుంది​ హీరోయిన్​ తాప్సీ పన్ను. తాజాగా, ‘సాంఢ్ కీ ఆంఖ్’​ మూవీ కోసం పరిశీలించిన తన ఫ‌స్ట్ ట్రయల్​ లుక్​ను సోష‌ల్ మీడియా వేదికగా పంచుకుందీ అందాల తార‌. తన సినీ కెరీర్​లో ఇదే అతిపెద్ద ప్రయోగం అని వెల్లడించింది. ఇందులో తాప్సీ ఊహించ‌ని విధంగా ఓ వృద్ధురాలిగా కనిపించింది. ఈ క్రమంలోనే తన అనుభవాలను అంద‌రితో పంచుకుంది.

“నా కెరీర్​లోనే ఇది అతిపెద్ద ప్ర‌యోగం‌. మొద‌టిసారి డైరెక్టర్​గా తుషార్ హీరా​నందాని​, తొలిసారి నిర్మాతగా నిధి పార్మర్హిరా, ఇక కెరీర్​లోనే మొద‌టిసారి ఇద్దరు నటీమణులు తమ వయసుకు మించిన పాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇందులో ఎంతో మంది ఫ‌స్ట్ టైమ్ సినిమా కోసం వ‌ర్క్ చేసిన‌ వ్యక్తులు ఉన్నారు. నాకు తెలిసి ఇది స్టార్ట‌ర్స్ అదృష్టం అనుకుంటా. ‘సాంఢ్​ కీ ఆంఖ్​’తో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి.”అని పేర్కొంది తాప్సి

కాగ ప్ర‌జంట్ ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ తాప్సీ షూటింగ్​ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఈ మెరుపుతీగ చేతిలో ‘రష్మీ రాకెట్’​, ‘శభాష్​ మిథు’, ‘హసీన్​ దిల్​రూబా’, ‘లూప్​ లాపెటా’ వంటి చిత్రాలు ఉన్నాయి.