కరోనా ఔషధ తయారీలో.. బ్రిటన్‌ ఫార్మా దిగ్గజం ‘సినైర్‌జెన్‌’ ముందడుగు..!

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఔషధం తయారీలో బ్రిటన్‌ ఫార్మా కంపెనీ ‘సినైర్‌జెన్‌’ పురోగతి సాధించింది. తాము అభివృద్ధిచేసిన ముక్కు ద్వారా పీల్చే ‘ఇంటర్‌ఫెరాన్‌ బీటా’ అనే సైటోకైన్‌ ప్రొటీన్‌ ఔషధ ఫార్ములా ‘ఎస్‌ఎన్‌జీ001’ కొవిడ్‌ రోగుల్లో ఇన్ఫెక్షన్‌ను కట్టడి చేసిందని సినైర్‌జెన్‌ సీఈవో రిచర్డ్‌ మార్స్‌డెన్‌ తెలిపారు. సాధారణంగా మన శరీరం ఇన్ఫెక్షన్‌ బారినపడినప్పుడు.. రోగ నిరోధక వ్యవస్థ ఇంటర్‌ఫెరాన్‌ బీటాను విడుదల చేస్తుంది. కరోనా కట్టడికోసం.. ఈ ఇంటర్‌ఫెరాన్‌ బీటా […]

కరోనా ఔషధ తయారీలో.. బ్రిటన్‌ ఫార్మా దిగ్గజం ‘సినైర్‌జెన్‌’ ముందడుగు..!
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2020 | 7:18 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఔషధం తయారీలో బ్రిటన్‌ ఫార్మా కంపెనీ ‘సినైర్‌జెన్‌’ పురోగతి సాధించింది. తాము అభివృద్ధిచేసిన ముక్కు ద్వారా పీల్చే ‘ఇంటర్‌ఫెరాన్‌ బీటా’ అనే సైటోకైన్‌ ప్రొటీన్‌ ఔషధ ఫార్ములా ‘ఎస్‌ఎన్‌జీ001’ కొవిడ్‌ రోగుల్లో ఇన్ఫెక్షన్‌ను కట్టడి చేసిందని సినైర్‌జెన్‌ సీఈవో రిచర్డ్‌ మార్స్‌డెన్‌ తెలిపారు. సాధారణంగా మన శరీరం ఇన్ఫెక్షన్‌ బారినపడినప్పుడు.. రోగ నిరోధక వ్యవస్థ ఇంటర్‌ఫెరాన్‌ బీటాను విడుదల చేస్తుంది.

కరోనా కట్టడికోసం.. ఈ ఇంటర్‌ఫెరాన్‌ బీటా ఇంజెక్షన్‌నే.. ముక్కు ద్వారా పీల్చే ఫార్ములాగా మార్చి ‘ఎస్‌ఎన్‌జీ001’ పేరిట రోగులకు అందించినట్లు సినైర్‌జెన్‌ వెల్లడించింది. ఈ ప్రొటీన్‌తో ఉత్పత్తి అయ్యే ఇంజెక్షన్లను మెదడు, వెన్నెముక, కంటి నరాలను దెబ్బతీసే ‘మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌’ వ్యాధితో బాధపడే వారి చికిత్సకు వాడుతుంటారు.

సినైర్‌జెన్‌ ‘ఎస్‌ఎన్‌జీ001’ ఔషధాన్ని యూకేలోని 9 ఆస్పత్రుల్లో 101 మంది వలంటీర్లలో సగం మందికి నెబ్యులైజర్‌ ద్వారా అందించగా.. వారి ఊపిరితిత్తుల పనితీరు పూర్వస్థితికి చేరుకోవడంతో పాటు ఇన్ఫెక్షన్‌ తగ్గిందని తెలిపింది. సాధారణ చికిత్సపొందిన వలంటీర్లతో పోలిస్తే.. ఎస్‌ఎన్‌జీ001 వాడిన వారు రెట్టింపు సంఖ్యలో కోలుకున్నారని వివరించింది. ఇన్ఫెక్షన్‌ను అదుపులోకి తేవడంలో ఈ ఔషధ ఫార్ములా విజయవంతమైందని సినైర్‌జెన్‌ పేర్కొంది.