దేశభక్తినే నమ్ముకున్నాం.. హిట్ కొట్టాం: సురేందర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా గ్రాండ్ హిట్‌ను చిత్ర యూనిట్ ఎంజాయ్ చేస్తోంది. దక్షిణాదిలో 4 భాషలతోపాటు హిందీలోనూ ఈ మూవీ విడుదలైంది. అదే రోజు హృతిక్ నటించిన వార్ మూవీ కూడా విడుదలైంది. అయితే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సైరా అదరగొడుతోంది. బాలీవుడ్ కలెక్షన్లలో సైరా వార్ మూవీని క్రాస్ చేసింది. ఇక ‘సైరా’ చిత్రానికి దర్శకత్వం వహించడం ఎంతో సంతోషంగా ఉందని దర్శకుడు […]

దేశభక్తినే నమ్ముకున్నాం.. హిట్ కొట్టాం: సురేందర్ రెడ్డి
Follow us

| Edited By:

Updated on: Oct 03, 2019 | 6:48 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా గ్రాండ్ హిట్‌ను చిత్ర యూనిట్ ఎంజాయ్ చేస్తోంది. దక్షిణాదిలో 4 భాషలతోపాటు హిందీలోనూ ఈ మూవీ విడుదలైంది. అదే రోజు హృతిక్ నటించిన వార్ మూవీ కూడా విడుదలైంది. అయితే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సైరా అదరగొడుతోంది. బాలీవుడ్ కలెక్షన్లలో సైరా వార్ మూవీని క్రాస్ చేసింది.

ఇక ‘సైరా’ చిత్రానికి దర్శకత్వం వహించడం ఎంతో సంతోషంగా ఉందని దర్శకుడు సురేందర్‌ రెడ్డి అన్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించమని తనను ప్రోత్సహించినందుకు రామ్‌చరణ్‌, చిరంజీవికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. చిత్ర సక్సస్ మీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలు అప్పుడే అయిపోయాయా? అనిపించింది అన్నారు. కథ మొత్తం అనుకుని, నటీనటులను ఎంచుకున్న తర్వాత తాను నిద్రపోని రోజులు చాలా గడిపానన్నారు. ఇంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం ఇలాంటి సినిమాలు అసలు హిట్‌ అవుతాయా? ఇప్పటివరకూ ఇలాంటి సినిమాలు ఎన్ని హిట్‌ అయ్యాయి అని వెనక్కి వెళ్లి చూసుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. సినిమాలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదు. చిరంజీవిగారితో పాటలు లేవు. అంతేకాకుండా ఆయన పాత్రను చంపేస్తున్నాం. అసలు ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుందా అని భయం వేసిందన్నారు. తనకు ఈ సినిమాలో దేశభక్తి మాత్రమే కనబడిందన్నారు. చిరంజీవి కూడా అదే నమ్మారు. నా భుజం తట్టి ముందుకు పంపారని సురేందర్ రెడ్డి చెప్పారు. సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు. చిరంజీవి కలను రామ్‌చరణ్‌ సాకారం చేశారు. చిరంజీవి కలను నేను తెరకెక్కించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరికి నేను రుణపడి ఉంటాను.’ అని తెలిపారు.