Breaking News
  • ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించిన సర్వే ఆఫ్‌ ఇండియా. జమ్ము-కశ్మీర్‌ విభజన తర్వాత విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో ఏపీ రాజధానిగా ఏ నగరాన్ని చూపని సర్వే ఆఫ్‌ ఇండియా. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పత్రాల ఆధారంగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కొత్తమ్యాప్‌ విడుదల చేసిన సర్వేఆఫ్‌ ఇండియా.
  • యాదాద్రి: బైక్‌ను ఢీకొన్న గూడ్స్‌ రైలు. భర్త రాంరెడ్డి మృతి, భార్య రాధకు తీవ్రగాయాలు. భువనగిరి మండలం రాయగిరి రైల్వేస్టేషన్‌ దగ్గర ఘటన.
  • పార్టీ మారతారన్న వార్తలపై స్పందించిన మంత్రి ఈటల. నేను పార్టీ మారను-మంత్రి ఈటల. గాలి వార్తలపై నేను స్పందించను. చెప్పే వాళ్లు ఎన్నైనా చెప్తారు-మంత్రి ఈటల.
  • సుజనాచౌదరి వ్యాఖ్యలకు మంత్రి మోపిదేవి కౌంటర్‌. గోడ దూకే ఎంపీలెవరూ వైసీపీలో లేరు. జగన్‌పై ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తిరుమలను ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన ప్రభుత్వానికి లేదు -మంత్రి మోపిదేవి వెంకటరమణ.
  • ఈ ప్రపంచంలో దేనికైనా రంగులు వేయొచ్చు కష్టానికి తప్ప. అమరావతిని అంతర్జాతీయ పటంలో పెట్టింది చంద్రబాబు. అమరావతిని చేర్చి సర్వే ఆఫ్‌ ఇండియా కొత్త మ్యాప్‌ విడుదల చేసేలా లోక్‌సభలో పోరాడిన గల్లా జయదేవ్‌కు అభినందనలు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌

Sye Raa: చిరు, అమితాబ్ మధ్య ఏమైంది..!

Sye Raa: What is the reason behind Amitabh Bachchan silence?, Sye Raa: చిరు, అమితాబ్ మధ్య ఏమైంది..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించాడు. నరసింహారెడ్డి గురువు కోసాయి వెంకన్న అనే పాత్రలో బిగ్‌బీ కనిపించనున్నారు. ఈ పాత్ర చిన్నదే అయినా చిరుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా.. ఇందులో నటించేందుకు బిగ్ బీ ఒప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇక ఈ మూవీలో నటించాలని తాను అమితాబ్‌ను కోరిన వెంటనే సానుకూలంగా స్పందించారని మెగాస్టార్ చిరంజీవి సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాకుండా ప్రయాణానికి తాము ఏర్పాట్లు చేస్తామని చెప్పినా.. బిగ్ బీ తన సొంత చార్టర్ ఫ్లైట్‌లోనే షూటింగ్‌కు వచ్చే వారని.. తన సినిమాలో అమితాబ్ భాగం అవ్వడం తన అదృష్టమని చిరు సంతోషంగా చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఈ మూవీపై ఎప్పటినుంచో సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు అమితాబ్. అటు ఏ ఇంటర్వ్యూలో గానీ.. ఇటు తన ట్విట్టర్‌లో గానీ ఈ మూవీ గురించి అమితాబ్ స్పందించకపోవడం విశేషం. సినిమా షూటింగ్‌ ప్రారంభమైన మొదట్లో ‘‘సూపర్‌స్టార్ చిరంజీవి అదే ప్రేమ్‌లో ఒక గౌరవం ఉండాలి’’.. ‘‘మెగాస్టార్‌తో పనిచేయడం ఒక గౌరవం’’ అని రెండు ట్వీట్లు మాత్రమే చేసిన బిగ్‌బీ.. ఆ తరువాత ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అంతేకాదు గతేడాది పుట్టినరోజున ‘సైరా’ టీమ్ బిగ్‌బీ లుక్‌ను రివీల్ చేయగా.. దాన్ని కూడా ఆయన షేర్ చేయలేదు. ఇక సైరా నుంచి ఇటీవల కాలంలో వచ్చిన టీజర్, మేకింగ్ వీడియోను కూడా ఆయన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకోలేదు.

అయితే తాను నటించే ప్రతి సినిమా విశేషాలను అమితాబ్ సాధారణంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటుంటారు. ఇలా చేయడం వలన సినిమాకు ప్రమోషన్ కూడా వస్తుంటుంది. అలాంటిది సైరా గురించి ఆ రెండు ట్వీట్లు తప్ప ఇంతవరకు బిగ్ బీ ఎక్కడా స్పందించలేదు. పోనీ ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేయడం లేదు. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ప్రమోషన్ కూడా చాలా అవసరం. ఇక ఈ సినిమాలో నటించినప్పటికీ అమితాబ్ మాత్రం అలాంటి ప్రమోషన్లు చేయకపోవడం గమనర్హం. ఇదంతా పక్కనపెడితే సైరా షూటింగ్‌లో కూడా అమితాబ్‌తో గొడవలైనట్లు గానీ, ఇబ్బంది పడ్డట్లు గానీ ఎలాంటి వార్తలు రాలేదు. ఈ నేపథ్యంలో మరి ఇప్పటివరకు ‘సైరా’పై అమితాబ్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనేది ఇప్పుడు కొందరిలో తొలుస్తున్న ప్రశ్న.