‘సైరా’తో ‘భీష్మ’ యుద్ధం..?

Sye Raa And Bheeshma Movies, ‘సైరా’తో ‘భీష్మ’ యుద్ధం..?

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఈ చిత్ర ట్రైలర్, ఆడియోను విడుదల చేయనున్నారు. సోలోగా దసరాకు రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ‘భీష్మ’ అడ్డు తగలనున్నాడని సమాచారం.

యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్నా జంటగా దర్శకుడు వెంకీ కుడుముల రూపొందిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట చిత్ర యూనిట్. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మరి ఈ సీనియర్ హీరో, యంగ్ హీరో ఫైట్‌లో విన్నర్ ఎవరో వేచి చూడాలి.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *