‘సైరా’ టీజర్ సరికొత్త రికార్డు!

Sye Raa Teaser Creates Records, ‘సైరా’ టీజర్ సరికొత్త రికార్డు!

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘సైరా’ టీజర్‌ను నిన్న విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించే చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చారిత్రాత్మక సినిమాను హీరో రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ‘సైరా’ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

అదీ కూడా ‘సైరా’ కన్నడ టీజర్ కొత్త రికార్డు సృష్టించింది. 24 గంటల్లో 3 మిలియన్ వ్యూస్ రాబట్టిన తొలి కన్నడ టీజర్‌గా పేరుగాంచింది. దీనితో సుదీప్ ‘పహిల్వాన్’ నమోదు చేసిన 2.3 మిలియన్ వ్యూస్ రికార్డును చెరిపేసింది. విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా, అమితాబ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *