సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..?

Chiranjeevis Sye Raa Narasimha Reddy Pre-Release Event Postponed To This Date?, సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సైరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈనెల 18 వ తేదీన జరగాల్సి ఉన్నది. అయితే, కొన్ని అనుకోని కారణాల వలన ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా.. అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22 వ తేదీన నిర్వహించే అవకాశం ఉన్నది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉన్నది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. తొలితెలుగు స్వాతంత్ర సమరయోధుడు కావడం, ఆయన చరిత్ర గురించి పెద్దగా బయట పరిచయం లేకపోవడం.. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి ఆ పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ యాక్టర్లు నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *