Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

Sye Raa: పవర్‌స్టార్ వాయిస్‌తో ‘సైరా’ ట్రైలర్..!

Pawan Kalyan voice over to Sye Raa trailer, Sye Raa: పవర్‌స్టార్ వాయిస్‌తో ‘సైరా’ ట్రైలర్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మరో గంటలో మేకింగ్ వీడియో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ నెల 22న చిరు పుట్టినరోజు నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. దానికి చిరు సోదరుడు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ట్రైలర్‌కు అదనపు ఆకర్షణ అవ్వడంతో పాటు మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అవుతుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రానున్న ఈ మూవీలో పలు ఇండస్ట్రీలకు చెందిన భారీ తారాగణం నటించింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, రవి కిషన్, నయనతార, తమన్నా వంటి స్టార్ నటీ నటులు ఈ సినిమాలో భాగం అయ్యారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించాడు. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

Related Tags