‘సైరా’ కోసం పవన్ మరోసారి.?

Pawan Kalyan To Lend Voice Over Again In Sye Raa Movie, ‘సైరా’ కోసం పవన్ మరోసారి.?

అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ‘సైరా’ ట్రైలర్‌ను నిన్న విడుదల చేశారు. అనుకున్నట్లుగానే యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతూ.. టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మెగా ఫ్యాన్స్‌కు ట్రైలర్ పెద్ద ట్రీట్ అని చెప్పవచ్చు. కాగా నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

సైరా టీజర్‌లో పవన్ వాయిస్ ఓవర్ ఉంది కదా..? మరి మూవీలో కూడా పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. కొంచెం సందేహిస్తూనే చరణ్ అవునని సమాధానం ఇచ్చారు. ఇక ఈ సమాచారానికి పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. టీజర్ మాదిరిగానే సినిమాకు కూడా పవన్ వాయిస్ ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *