Breaking News
  • ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. వర్షాలతో ఇసుక కొరత ఏర్పడింది. అప్పుడే దీక్షలు ఎందుకు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించలేకపోతున్నారు-వంశీ
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • రాఫెల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమని.సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది-బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌. మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జఠిల సమస్యలను సామరస్య పూర్వకంగా మోదీ పరిష్కరించారు. తెలంగాణలో అశాంతి, అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారు-లక్ష్మణ్‌
  • ముగిసిన ఆర్టీసీ, పొలిటికల్‌ జేఏసీ సమావేశం.
  • ఇసుక కొరతపై 12 గంటల పాటు దీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు బాధితులకు అండగా నిలిస్తే దాడులు చేస్తున్నారు. ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. నాపై కోపంతో అన్న క్యాంటీన్లు మూసేశారు-చంద్రబాబు
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • ఇసుక కొరత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నష్టపోయారు. చంద్రబాబు మీద కక్షతోనే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవహేళన చేసింది.సచివాలయాలకు వైసీపీ రంగులేసే జగన్‌కు గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు-ఎంపీ రామ్మోహన్‌నాయుడు

సైరా టీమ్ నుంచి మరో ట్రైలర్.. అమితాబ్ డైలాగ్ వింటే అదిరిపోతారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ తాజాగా మరో కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దాదాపు ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో నరసింహారెడ్డి, అతడి యోధులు కలిసి వీరోచితంగా బ్రిటిష్ దొరలపై చేసిన దండయాత్రను చూపించారు. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు అనిపిస్తోంది. ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించేలా చిరు పలికిన డైలాగ్స్ ఒళ్ళు గగ్గుర్పొడిచేలా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసిందని చెప్పొచ్చు.

నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 2న గాంధీ జయంతి పురస్కరించుకుని విడుదల కాబోతోంది. దాదాపు 270 కోట్లతో హీరో రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నాడు.