సైరా గ్రాఫిక్స్ బడ్జెట్ @45 కోట్లు: మరి సినిమా బడ్జెట్ ఎంత..?

Ram Charan spent Rs 45 crore on VFX for dad Chiranjeevi's film?, సైరా గ్రాఫిక్స్ బడ్జెట్ @45 కోట్లు: మరి సినిమా బడ్జెట్ ఎంత..?

గ్రాఫిక్స్ అంటే.. ముందు మనకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘బాహుబలి-2’నే గుర్తొస్తాయి. దానికి ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఆయనే. కాగా.. ఇప్పుడు అదే స్థాయిలో.. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య పాత్రదారుడిగా.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. ఇప్పుడు ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్‌కు చిత్రయూనిట్ పెద్ద పీట వేసిందట. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే.. ఎక్కడా రాజీపడకుండా.. బడ్జెట్‌కు వెనకాడకుండా.. ప్రొడ్యూసర్ రామ్ చరణ్.. పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాకి 45 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా 17 కంపెనీలకు చెందిన వారు డిజైన్ చేస్తున్నారట. ప్రతీ సన్నివేశం సహజసిద్ధంగా చూపించేందుకు వీరు బాగా కష్టపడుతున్నారని సమాచారం. ఈ సినిమా గ్రాఫిక్స్‌కే ఇంత ఖర్చు చేస్తుంటే.. మరి సినిమా మొత్తానికి ఎంత ఖర్చు అవుతుందనే ఐడియా వచ్చింది కదా..! మొత్తంగా ఈ సినిమాకు అయ్యే బడ్జెట్ చూసుకుంటే.. సుమారు రూ.270 కోట్లకు పైగానే లెక్క వస్తుందట.

కాగా.. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో వేడుకను నిర్వహించాలనుకున్నా.. ఆ సమయంలో.. వర్ష సూచన ఉండటంతో.. వాయిదా వేశారు. ఈ నెల 18న ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా… ఈ నెల 22న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంపచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *