Breaking News
  • డా.వసంత్‌కు డీఎంహెచ్‌వోలో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు. గాంధీలో సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ వసంత్‌. తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని హెల్త్‌ డైరెక్టర్‌ను కలిసిన వసంత్‌.
  • మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన మహిళ. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు. తన భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడంలేదని ఆవేదన. మంత్రి నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి.
  • రేపు ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు. మండలిని రద్దు చేయొద్దంటూ ఢిల్లీ పెద్దలను కలవనున్న ఎమ్మెల్సీలు. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎమ్మెల్సీలు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న టీడీపీ బృందం.
  • సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌.
  • బెంగాల్‌ సర్కార్ సంచలన నిర్ణయం. ఎన్నికల వ్యూహకర్త పీకేకు జెడ్‌కేటగిరీ భద్రత. తృణమూల్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్న పీకే.
  • అనంతపురం: ఏసీబీ అధికారి అవతారం ఎత్తిన కేటుగాడు. ఏసీబీ అధికారి నుంటూ పలువురు నుంచి భారీగా వసూళ్లు. ఇప్పటి వరకు పలువురు అధికారుల నుంచి రూ.27 లక్షలు వసూలు. చివరకు పోలీసులకు చిక్కిన కేటుగాడు జయకృష్ణ. రూ.2.91 లక్షలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.

బాక్సాఫీసుపై ‘సైరా’ దండయాత్ర

Sye Raa Narasimha Reddy Movie box office collections, బాక్సాఫీసుపై ‘సైరా’ దండయాత్ర
బుధవారం విడుదలవుతున్న మచ్ వెయిటెడ్ మెగాస్టార్‌ మూవీ సైరా.. నరసింహారెడ్డి బాక్సాఫీసు మీద దండయాత్ర చేసే పరిస్థితి కనిపిస్తోంది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం బుధవారం విడుదలకానున్న నేపథ్యంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
‘సైరా నరసింహారెడ్డి’ తొలి రోజు దక్షిణాదిలో రూ. 30 కోట్లు రాబట్టే అవకాశముందని ప్రముఖ ఫిల్మ్‌ ట్రేడ్‌ విశ్లేషకుడు గిరీశ్‌ జోహార్‌ అంఛనా వేస్తున్నారు.   ‘దక్షిణాదిలో చిరంజీవి పెద్ద స్టార్‌. ఆయన తాజా చిత్రం భారీ ఎత్తున విడుదలవుతోంది. అడ్వాన్స్‌ బుకింగ్‌ కూడా బ్రహ్మండంగా ఉన్నాయి. హిందీకి వచ్చేసరికి వార్‌ సినిమాకే మొదటి ప్రాధాన్యం దక్కుతుంది.
Sye Raa Narasimha Reddy Movie box office collections, బాక్సాఫీసుపై ‘సైరా’ దండయాత్ర
వార్‌ సినిమా ఎలా ఉంటుందనే దానిపైనే బాలీవుడ్‌లో సైరా సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. సౌత్‌లో మాత్రం సైరా బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుందని కచ్చితంగా చెప్పగలను’ అంటూ గిరీశ్‌ జోహార్‌ వివరించారు. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’లో సినిమాతో చిరంజీవి సరికొత్త చరిత్రను లిఖించనున్నారని యూఏఈ సెన్సార్‌ బోర్డు సభ్యుడు ఉమైర్‌ సంధు ప్రశంసించారు. మరోవైపు ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకానున్న థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అభిమానులు భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు.
Sye Raa Narasimha Reddy Movie box office collections, బాక్సాఫీసుపై ‘సైరా’ దండయాత్ర
శాటిలైట్స్, ఓవర్ సీస్, డిజిటల్ హక్కుల రూపంలో ఇప్పటికే రికార్డు రెవెన్యూ రాబట్టుకున్న నిర్మాతలకు సైరా విడుదల తర్వాత కలెక్షన్ల పంట పండడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు అంఛనా వేస్తున్నాయి. తెలుగులో పెద్ద హీరో చిరంజీవికి… కన్నడంలో సుదీప్, తమిళంలో విజయ్ సేతుపతి, నయనతార, హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్ఛన్ తోడవడంతో ఈ అన్ని చోట్ల సైరాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Sye Raa Narasimha Reddy Movie box office collections, బాక్సాఫీసుపై ‘సైరా’ దండయాత్ర
అయితే.. వార్‌ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్ల అమ్మకాలు బాగున్నాయని, ఇప్పటికే రూ. 25 కోట్లు వచ్చాయని వెల్లడించారు. సినిమా బాగుందని టాక్‌ వస్తే ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్‌ రికార్డు(రూ.27.5 కోట్లు)ను వార్‌ అధిగమిస్తుందని జోస్యం చెప్పారు. వరుస సెలవులు ఉండడంతో కలెక్షన్లు భారీగానే ఉండే అవకాశముందని గిరీశ్‌ జోహార్‌ అంచనా వేశారు.
Sye Raa Narasimha Reddy Movie box office collections, బాక్సాఫీసుపై ‘సైరా’ దండయాత్ర