Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

Sye Raa: అంచనాలు పెంచేసిన మేకింగ్ వీడియో

Sye Raa making video released, Sye Raa: అంచనాలు పెంచేసిన మేకింగ్ వీడియో

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా సైరా మేకింగ్ వీడియోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. 1.47నిమిషాల పాటు సాగిన ఈ మేకింగ్ వీడియోలో మూవీ కోసం ఉపయోగించిన దుస్తులు, వారు ఉపయోగించిన కత్తులు, ప్రధాన తారాగణం గెటప్‌లె మొత్తాన్ని చూపించారు. మొత్తానికి మేకింగ్ వీడియోతో మరోసారి అంచనాలను పెంచేసింది చిత్ర యూనిట్. అలాగే సైరా టీజర్ ఈ నెల 20న రానుందని కూడా వెల్లడించారు ఈ మూవీ హిందీ రైట్స్ సొంతం చేసుకున్న నటుడు ఫర్హాన్ అక్తర్.

కాగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రానున్న ఈ మూవీలో మెగాస్టార్ సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, రవి కిషన్,  తమన్నా,నిహారిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.