బాలీవుడ్ హీరోల ‘వార్’లో ‘సైరా’ గట్టెక్కుతాడా.?

‘సైరా నరసింహారెడ్డి’… మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ దాదాపు 250 కోట్ల వ్యయంతో నిర్మించాడు. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 2న విడుదల […]

బాలీవుడ్ హీరోల 'వార్'లో 'సైరా' గట్టెక్కుతాడా.?
Follow us

|

Updated on: Sep 22, 2019 | 10:39 AM

‘సైరా నరసింహారెడ్డి’… మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ దాదాపు 250 కోట్ల వ్యయంతో నిర్మించాడు. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 2న విడుదల కానుంది.

ఇది ఇలా ఉండగా ‘సైరా’ సినిమా తెలుగునాట బీభత్సమైన రికార్డులను క్రియేట్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో ఓకే గానీ.. మిగిలిన భాషల్లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించడం కొంచెం కష్టమేనంటున్నారు సినీ విశ్లేషకులు. ముఖ్యంగా చిరంజీవికి తెలుగులో భారీ మార్కెట్ ఉంది. దాదాపు 10 ఏళ్లు ఇండస్ట్రీకి దూరమైనా.. ఖైదీ నంబర్.150తో చిరంజీవి అదిరిపోయే రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ‘సైరా’ సినిమాకు కూడా తెలుగులో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే మిగిలిన బాషల గురించి పక్కన పెడితే.. బాలీవుడ్‌లో మాత్రం ‘వార్’ నుంచి ‘సైరా’ గట్టి పోటీనే ఎదుర్కొనేలా ఉంది. అదీ కూడా యాక్షన్ హీరోల హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల సినిమా. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ మూవీస్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మిస్తోంది. ఈ మూవీ కూడా అక్టోబర్ 2నే విడుదల కానుంది.

ఈ బాలీవుడ్ హీరోల ‘వార్’లో ‘సైరా’ గట్టెక్కుతాడా అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. యాక్షన్ హీరో హృతిక్ రోషన్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు టైగర్ ష్రాఫ్ కూడా ‘భాగీ’, ‘భాగీ 2’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఇప్పటికే మెజారిటీ థియేటర్లను ‘వార్’ సినిమాకు బుక్ చేసేసింది. ఇలాంటి తరుణంలో ‘సైరా’ హిందీలో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాలి. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వారు ‘సైరా’కు సపోర్ట్ ఇస్తుండటంతో.. ఈ బాలీవుడ్ హీరోలకు ‘సైరా’ పెద్ద సవాల్‌నే విసురుతాడు.