Breaking News
  • విశాఖ: సింహాద్రి అప్పన్నస్వామికి స్వర్ణ తులసీ దళాలు సమర్పణ. రూ.25 లక్షలు విలువైన 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన బోకం శ్రీనివాసరావు దంపతులు. గతంలోనూ పలు కానుకలు సమర్పించిన శ్రీనివాసరావు.
  • అమరావతి: ఓఎన్‌జీసీ, గెయిల్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి భేటీ. మత్స్యకారులకు చేయూతనివ్వాలని కోరిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్పొరేట్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద 2శాతం చెల్లించాలని కోరిన మంత్రి. గతంలో రూ.150 కోట్లు ఇస్తామని ఓఎన్‌జీసీ, గెయిల్‌ అంగీకారం. బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే చెల్లించాలని కోరిన పెద్దిరెడ్డి. ఆయిల్ నిక్షేపాల వెలికితీత సమయంలో మత్స్య సంపదకు నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.
  • తిరుపతి: మీడియాతో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చిట్‌చాట్‌. పీసీసీ చీఫ్‌ పదవి మీడియా ఊహగానాలేనన్న కిరణ్‌కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్‌ పదవిపై అంతగా ఆసక్తి లేదన్న మాజీ సీఎం. తాజా రాజకీయాల తీరుపై తీవ్ర అసంతృప్తి. తాను తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానన్న కిరణ్‌. చిత్తూరు జిల్లాలో తాను ప్రారంభించిన తాగు, సాగు నీరు ప్రాజెక్టు కొనసాగించకపోవడం పట్ల ఆవేదన. తిరుపతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించకపోవడంపై అసంతృప్తి.
  • సైదాబాద్‌ పీఎస్‌లో అక్బరుద్దీన్‌పై కేసునమోదు. అక్బరుద్దీన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సైదాబాద్‌ పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు. భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన అక్బరుద్దీన్‌. న్యాయవాది కరుణసాగర్‌ ఫిర్యాదుతో కేసునమోదు.
  • గుంటూరు: దుర్గి మండలం ధర్మవరంలో జనసేన నేతల పర్యటన. బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలకు పరామర్శ. గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ. గురజాల డీఎస్పీ శ్రీహరిని కలిసిన జనసేన నేతలు. గొడవతో సంబంధం లేని వారిని కేసుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి. గురజాల సబ్‌జైలులో ఉన్న ధర్మవరం జనసైనికులకు పరామర్శ.
  • తూ.గో: రాజమండ్రి దగ్గర పురాతన హెవలాక్‌ బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్‌, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌. హెవలాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దనున్న ప్రభుత్వం. వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, ఫుడ్‌బజార్‌, ఫ్యాషన్‌ బజార్లకు ఏర్పాటు. 40 అడుగుల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఎండీ ప్రవీణ్‌కుమార్‌.

మీ అద్భుత విజయంలో నన్ను భాగం చేశారు.. చాలా థ్యాంక్స్

Anushka thanks Sye Raa team, మీ అద్భుత విజయంలో నన్ను భాగం చేశారు.. చాలా థ్యాంక్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ.. మెగాస్టార్ స్టామినాను చాటుతోంది. ఇక ఈ మూవీలో అనుష్క అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో బ్రిటీష్ వారితో పోరాడిన ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా ఈ యోగా బ్యూటీ నటించింది. సైరాలో ఈ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా అనుష్క అద్భుతంగా నటించింది. ఇక తాజాగా ఈ మూవీ విజయంపై సోషల్ మీడియాలో స్పందించిన అనుష్క.. చిత్ర యూనిట్‌ను థ్యాంక్స్ చెప్పింది.

‘‘తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితాన్ని తెర మీద చూపించాలని రామ్ చరణ్ అనుకున్నప్పుడు.. అందుకోసం మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో కష్టపడి.. అంకిత భావంతో పనిచేసినప్పుడు.. వారి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నా వంతు బాధ్యతను నిర్వర్తించాను. ఈ సినిమాలో పనిచేసినందుకు చిత్ర యూనిట్ నన్ను చిత్ర బృందం ప్రశంసించింది. ఈ అద్భుత చిత్రంలో నన్ను కూడా భాగం చేసినందుకు చిరంజీవి గారికి, దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి, చరణ్‌, సైరా టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. అలాగే సినిమా విడుదలైనప్పటి నుంచి నా పాత్రపై అమితమైన ప్రేమను చూపించిన ప్రేక్షకులు, నా అభిమానులందరికీ థ్యాంక్స్’’ అని అనుష్క తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. కాగా ఈ మూవీ కోసం పిలుస్తూనే అనుష్క అమెరికా నుంచి వచ్చిందని.. తన కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపిన విషయం తెలిసిందే.

View this post on Instagram

Thank u #SyeRaa ⚔️🔥

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on