చెన్నైలో స్విగ్గీ ఆర్డర్ చేస్తే రాజస్థాన్ నుంచి డెలివరీ

చెన్నై: చెన్నైలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ చేస్తే అది రాజస్థాన్ నుంచి డెలవరీ అవుతున్నట్టు చూపించింది. అది కూడా కేవలం 12 నిమిషాల్లోనే ఫుడ్ చేరుకుంటుందని ఫోన్‌లో చూపించడంతో అవాక్కవ్వడం కస్టమర్ వంతైంది. ఈ వింత అనుభవాన్ని ఎదుర్కొన్న చెన్నైకు చెందిన భార్గవ్ రాజన్ అనే వ్యక్తి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే అది వెంటనే వైరల్ ఐపోయింది. స్విగ్గీలో ఆర్డర్ చేసిన తర్వాత ఫోన్‌లో చెక్ చేయగా డెలవరీ బాయ్ […]

  • Vijay K
  • Publish Date - 8:48 pm, Wed, 20 February 19

చెన్నై: చెన్నైలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ చేస్తే అది రాజస్థాన్ నుంచి డెలవరీ అవుతున్నట్టు చూపించింది. అది కూడా కేవలం 12 నిమిషాల్లోనే ఫుడ్ చేరుకుంటుందని ఫోన్‌లో చూపించడంతో అవాక్కవ్వడం కస్టమర్ వంతైంది. ఈ వింత అనుభవాన్ని ఎదుర్కొన్న చెన్నైకు చెందిన భార్గవ్ రాజన్ అనే వ్యక్తి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అంతే అది వెంటనే వైరల్ ఐపోయింది. స్విగ్గీలో ఆర్డర్ చేసిన తర్వాత ఫోన్‌లో చెక్ చేయగా డెలవరీ బాయ్ రాజస్థాన్ నుంచి బయల్దేరాడని, ఇంకో 12 నిమిషాల్లో చేరుకుంటాడని చూపించింది. కంగుతిన్న భార్గవ్ వెంటనే ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెడుతూ వావ్ స్విగ్గీ ఏం చేస్తున్నావ్? అని ప్రశ్న వేశాడు.

అయితే కాసేపటి తర్వాత స్విగ్గీ ఆ కస్టమర్‌కు రిప్లై ఇచ్చింది. సాంకేతిక లోపం కారణంగా తప్పు జరిగిందని తెలిపింది. భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం అని తెలిపింది. ఇది దేవుడు చేసిన అల్లరిపనిలా ఉందని, తాము చంద్ర మండలం నుంచి కూడా స్విగ్గీని డెలవరీ చేయగలం అని సరదాగా వ్యాఖ్యానించింది.