Breaking News
  • మ‌హేష్‌కు చిరంజీవి శుభాకాంక్ష‌లు *పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌హేష్‌ని విష్ చేసిన మెగాస్టార్‌ * ''అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. * మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలి.. * మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటున్నా. * హ్యాపీ బ‌ర్త్ డే మ‌హేష్‌... అని చిరంజీవి ట్వీట్‌
  • అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఫోన్ లో మాట్లాడినా ప్రధాని నరేంద్ర మోదీ. స్వర్ణ ప్యాలస్ ఫైర్ యాక్సిడెంట్ ఘటన పై ఆరా. అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని ప్రధాని హామీ.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • BREAKING కీలక ప్రకటన చేస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 101 రక్షణరంగ పరికరాలపై ఎంబార్గో. ఎంబార్గో కాల పరిమితి తర్వాత వాటి దిగుమతిపై నిషేధం. స్వయం సమృద్ధి, ఆత్మ నిర్భరత సాధించే క్రమంలో ఇదో కీలక పరిణామం. ఈ నిర్ణయం దేశంలోని రక్షణ తయారీ రంగంలో విస్తృత అవకాశాలను సృష్టిస్తుంది. డీఆర్డీవో రూపొందించిన పరికరాలను భారీగా ఉత్పత్తి చేసే వీలు కల్గుతుంది. విస్తృత సంప్రదింపులు, చర్చల అనంతరం 101 వస్తువులు పరికరాల జాబితాను రక్షణ శాఖ తయారుచేసింది. ఏప్రిల్ 2015 నుంచి ఆగస్టు 2020 మధ్య త్రివిధ దళాలకు రూ. 3.5 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టుల ద్వారా పరికరాలు దిగుమతి అయ్యాయి. రానున్న 6-7 సంవత్సరాల్లో దేశీయంగా రూ. 4 లక్షల కోట్ల ఆర్డర్స్ దేశీయ పరిశ్రమలకు దక్కుతాయి. ఇందులో ఆర్మీ, ఎయిర్‌ఫోర్సుకి కలిపి రూ. 1,30,000 కోట్ల విలువైన వస్తువులు, రూ. 1,40,000 కోట్ల విలువైన నావికాదళ ఆయుధాలు, పరికరాలు అవసరమవుతాయని అంచనా. జాబితాలో ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికిల్స్ కూడా ఉన్నాయి. వీటి దిగుమతి 2021 డిసెంబర్ నుంచి బంద్. రూ. 5,000 కోట్లు విలువైన 200 వీల్డ్ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికిల్స్ కి ఆర్మీ కాంట్రాక్టు ఇవ్వనుంది. రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి.
  • విజయవాడ: స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి వివరాలు. డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58). పూర్ణ చంద్ర రావు.. మొవ్వ . సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.). మజ్జి గోపి మచిలీపట్నం. స్వర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు. 6 మృతదేహాలు ఇంకా గుర్తించవలసి ఉంది...( బంధువులు రావాలి). పూర్తి గా కాలిన ఒక మృత దేహం.
  • కోవిడ్ సెంటర్ కు అనుమతి తీసుకోలేదన్న ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జయరాం నాయక్. స్వర్ణ హోటల్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు బేఖాతరు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగలేదన్న హోటల్ సిబ్బంది. ప్రమాదం జరిగినప్పుడు బ్యక్ డోర్ ఓపెన్ చేయడంలో ఆలస్యం. అగ్ని ప్రమాదంపై విచారణ చేస్తున్నాం.. విచారణ తర్వాత హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం : జయరాం నాయక్.

స్వప్న సురేష్ కోసం ‘లుక్ ఔట్ నోటీసు’ జారీ.. ?

కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన  స్వప్న సురేష్ కోసం లుక్ ఔట్ నోటీసు జారీ చేసే యోచనలో ఉన్నామని కస్టమ్స్ శాఖ ప్రకటించింది. ఆమె పరారీలో ఉన్న సంగతి విదితమే. ఈ రాష్ట్రంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ కి చెందిన..
Swapna Suresh Call Records, స్వప్న సురేష్ కోసం ‘లుక్ ఔట్ నోటీసు’ జారీ.. ?

కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన  స్వప్న సురేష్ కోసం లుక్ ఔట్ నోటీసు జారీ చేసే యోచనలో ఉన్నామని కస్టమ్స్ శాఖ ప్రకటించింది. ఆమె పరారీలో ఉన్న సంగతి విదితమే. ఈ రాష్ట్రంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ కి చెందిన ఓ మాజీ ఉద్యోగిని అరెస్టు చేశామని, అతని నుంచి వివరాలు సేకరిస్తున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 15 కోట్ల విలువైన 30 కేజీల బంగారం స్వాధీనం వార్త సంచలనం రేపింది. ఈ కేసును  కస్టమ్స్ తో బాటు సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఎ) దర్యాప్తు చేయవచ్చునని, అలాగే జాతీయ భద్రతతో కూడిన అంశమైనందున ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (‘రా’) కూడా ఇందులోభాగమయ్యే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది.

నాలుగు రోజులక్రితం ఏం జరిగింది ?

నాలుగు రోజుల క్రితం తిరువనంతపురంలోని యుఏఈ కాన్సులేట్ కార్యాలయానికి పి. సరిత్ అనే ఉద్యోగి పేరిట ఓ పార్సెల్ అందింది. అందులో ఈ బంగారం ఉంది. ఈ వైనం కస్టమ్స్ కి తెలిసి అతడిని అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించింది. (కాగా ఒక్క ‘మాల్’ పూర్తయితే స్వప్న సురేష్ కి లక్షల్లో కమీషన్ అందేదని తెలుస్తోంది). స్వప్నకి పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నేతలతో లింక్ ఉన్నట్టు భావిస్తున్నారు. కేరళలో ఆమె పాలక ఎల్ డీ ఎఫ్ నాయకులకు పలు ఫోన్ కాల్స్ చేసినట్టు అనుమానిస్తున్నారు. గల్ఫ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ కోసం ఆమె తన ‘దౌత్యహోదా’ ను అడ్డుపెట్టుకుని కాన్సులేట్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిందట. స్పేస్ పార్క్ ప్రాజెక్టులో ఆమె జాబ్ లో చేరినప్పుడు నెలకు జీతం లక్ష రూపాయలని, కానీ అంతకుముందు ఎయిరిండియాకు చెందిన ‘శాట్స్’ లో ఆమె వేతనం  25 వేలు మాత్రమేనని వెల్లడైంది. స్వప్న విద్యార్హతల్లో కూడా ఎన్నో అవకతవకలు బయటపడ్డాయి. తను జలంధర్ లో బీ.ఆర్. అంబేద్కర్ నిట్ నుంచి బీ. కామ్ పూర్తి చేశానని చెప్పుకున్నప్పటికీ.. ఆ సంస్థ బీ. కామ్ కోర్సులేవీ నిర్వహించలేదని తెలిసింది.  అటు- సరిత్ కి, స్వప్న కి మధ్య ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు.

రాష్ట్రంలో శివశంకర్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగి తొలగింపు, గోల్డ్ స్మగ్లింగ్ కేసు, స్వప్న సురేష్ వ్యవహారం ముఖ్యమంత్రి విజయన్ ప్రభుత్వానికి తలనొప్పి తెస్తుండగా  .. ఇదే అదనని, ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పూనుకొంది.

 

Related Tags