Breaking: త్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద స్వామి క‌న్నుమూత‌..

త్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి చెందారు. తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడ కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ఆయ‌న ఆశ్ర‌మం న‌డిపిన విష‌యం తెలిసిందే. 

Breaking: త్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద స్వామి క‌న్నుమూత‌..
Follow us

|

Updated on: Jul 09, 2020 | 4:25 PM

త్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి చెందారు. తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడ కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ఆయ‌న ఆశ్ర‌మం న‌డిపిన విష‌యం తెలిసిందే.  ఆత్మజ్ఞానం పేరుతో కొన్ని వందల రచనలు చేశారు. హిందూ, ముస్లిం దేవుళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాల‌కు దారి తీశాయి. రెండేళ్ల క్రితం జేసీ దివాకరరెడ్డి వర్గీయులకు, ప్రబోధానంద స్వామి శిష్యుల మధ్య భారీ ఘర్షణ కూడా జ‌రిగింది. జేసీతో వైరంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రబోధనందా స్వామి సంచ‌ల‌నంగా మారారు. ప్రబోధానంద స్వామి మ‌ర‌ణంతో వేలాది మంది మంది భక్తులు విషాదంలో మునిగిపోయారు. తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడకు ఆయ‌న భౌతిక ఖాయాన్ని త‌ర‌లించారు. కడప జిల్లా కొండాపురం మండ‌లం బెడుదురు కొట్టాలపల్లిలో ప్రబోధానంద స్వామి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం.